సర్వాంగ సుందరంగా.. జీ20 సదస్సుకు ముస్తాబైన విశాఖ - G20 summit at radisson blu hotel in visakhapatnam
🎬 Watch Now: Feature Video
Arrangements for G20 Summit in Visakhapatnam: జీ20 దేశాల సదస్సు కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 28, 29 తేదీలలో జీ 20 దేశాల వర్కింగ్ గ్రూప్ కమిటీ మీటింగ్.. విశాఖలోని రాడిసన్ బ్లూ హొటల్లో జరగనుంది. సదస్సుకు హాజరవుతున్న G20 దేశాల ప్రతినిధులు వచ్చే రహదార్లను జీవీఎంసీ అధికారులు అందంగా తీర్చిదిద్దారు. విశాఖ విమానాశ్రయం నుంచి రాడిసన్ బ్లూ హోటల్ వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలో దాదాపు రెండు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీయులకు సంప్రదాయంగా స్వాగతం పలికేందుకు హోటల్ పరిసరాలన్నీ పూల మొక్కలతో అలకరించారు. ఈ వర్కింగ్ గ్రూప్ మీటింగ్లో 57 మంది వ్యక్తిగతంలో వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. రెండు దేశాల ప్రతినిధులు వర్చువల్గా హాజరవుతారని సమాచారం. ఈ వర్కింగ్ గ్రూప్ చర్చల కోసం జరిగిన ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.