Snake Carcass Found in YSR Sampoorna Poshana Kit: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం.. ఖర్జూర ప్యాకెట్లో పాము కళేబరం - గర్భిణికి ఇచ్చిన ఎండుఖర్జూరం ప్యాకెట్లో పాము
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-10-2023/640-480-19739144-thumbnail-16x9-snake.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 4:36 PM IST
Snake Carcass Found in YSR Sampoorna Poshana Kit: వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా గర్భిణీలకు అందించే పౌష్టికాహారంలో చనిపోయిన పాము రావడం తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో… గర్భిణి మానస రూపేష్ కు అంగన్ వాడీ సిబ్బంది పౌష్టికాహారం కిట్ అందజేశారు. మానస సీమంతం చేసుకుంటూ పౌష్టికాహారం కిట్ లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్ ను తెరచి చూశారు. అందులో చనిపోయిన పాము కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్ధానిక అంగన్ వాడీ కార్యకర్తను పిలిచి ప్యాకెట్ ను వెనక్కి ఇచ్చేశారు. ఆమె ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
"నా పేరు జానకమ్మ. నేను బంగారుపాళ్యం మండలం శాంతినగర్ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కాగా వైఎస్సార్ కిట్ నెలవారీగా ఇచ్చే సరుకుల్లో మానస రూపేష్ అనే గర్భిణికి ఎండుకర్జూల ప్యాకెట్ ఇచ్చాము. అయితే మానస సీమంతం చేసుకుంటూ పౌష్టికాహారం కిట్‌లోని ఎండు ఖర్జూరం ప్యాకెట్‌ను తెరచి చూడగా.. అందులో చనిపోయిన పాము కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. ఆ విషయాన్ని నాతో చెప్పారు. నేను దీనిపై ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాను." - జానకమ్మ, అంగన్వాడీ కార్యకర్త