Single Teacher Problem in Sirigapuram: ఓ వైపు పాఠాలు.. మరో వైపు వంటలు.. ఉపాధ్యాయురాలి అవస్థలు - కర్నూలు జిల్లాలో విద్యార్థులకు వంట చేస్తున్న టీచర్
🎬 Watch Now: Feature Video
Single Teacher Teaches and Cooks for the Students: అది కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో సరిహద్దు మండలంలోని ప్రాథమిక పాఠశాల. అక్కడ 62 మంది విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండటానికి ఎవరూ రావడం లేదు. దీంతో ఆ ఉపాధ్యాయురాలే వారికి భోజనం వండుతుంది. హాలహర్వి మండలం సిరిగాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకూ.. 62 మంది విద్యార్థులు ఉండగా.. ఇక్కడకు 52 మంది వరకూ విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తున్నారు. ఈ పాఠశాలలో కేవలం ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఓ వైపు విద్యార్థులకు బోధించడం, మరో వైపు మధ్యాహ్న భోజనం వండేందుకు ఎవరూ రాకపోవడంతో ఆమే వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. దీంతో ఒకవైపు పాఠాలు చెప్పడం, మరో వైపు భోజనం వండటం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న బిల్లులు చాలకపోవడంతో.. భోజనం వండటానికి ఎవరూ రావడం లేదు. విద్యార్థులకు భోజనం వండటానికి ఎవరూ రావడం లేదనే విషయాన్ని మండల విద్యాధికారికి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అన్ని వ్యవహారాలను చూసుకోవాల్సిన బాధ్యత ఒకరిపైనే పడింది.