'నా పొట్ట కొట్టొద్దు..' బిల్డింగ్ పైనుంచి దూకేసిన వ్యక్తి - Viral videos
🎬 Watch Now: Feature Video
Shopkeeper Jumped From the Roof: విజయనగరంలోని ఐస్ ఫ్యాక్టరీ కూడలిలో ఫుట్ పాత్ మీద ఆక్రమణలు తొలగించేందుకు పురపాలక సంఘం వాళ్లు చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన చిన్న టీ దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. తన పొట్ట కొట్టొద్దని.. దయచేసి కొద్దిరోజులు టైం ఇవ్వాలని పురపాలక అధికారులను వేడుకున్నాడు. కొన్ని రోజులు టైం ఇస్తే.. తరువాత తొలగించేస్తానని చెప్పాడు. అయినా సరే అతని మాటలను పురపాలక సిబ్బంది వినిపించుకోలేదు. తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు.
జేసీబీని పెట్టి.. ఫుట్ పాత మీద ఉన్న వాటిని తొలగిస్తుండగా.. సదరు దుకాణ నిర్వాహకుడు సత్యనారాయణ తీవ్ర ఆవేదనకి గురయ్యాడు. దీంతో మేడ మీదకు ఎక్కి దూకుతానని బెదిరించాడు.. అయినా సరే పురపాలక సిబ్బంది తొలగింపు ప్రక్రియ ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన సత్యనారాయణ మేడ మీద నుంచి దూకేశాడు. ఈ ఘటనలో దుకాణదారుడు సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.