Shock to Deputy CM Narayanaswamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి షాక్.. సమస్యలపై నిలదీసిన గ్రామస్థులు, పార్టీ నేతలు - పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2023, 5:16 PM IST

Shock to Deputy CM Narayanaswamy: పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ అగ్రహారంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని స్థానికులు పలు సమస్యలపై నిలదీశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'సమస్యలను పరిష్కరించాలని స్థానిక సర్పంచును నిలదీయండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఉన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దృష్టికి తేవడానికి మాజీ సర్పంచ్ ప్రయత్నించడంతో.. 'నువ్వు జ్ఞానేందర్ రెడ్డి (మాజీ ఎంపీ, ప్రస్తుత ఎన్నారై విభాగ ప్రభుత్వ సలహాదారు) మనిషివి.. సమస్యలు ఆయనతోనే చెప్పుకో' అంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తి.. మీరు మంత్రి కదా... ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు కదా.. మీరెందుకు మమ్మల్ని జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.. మీ గెలుపు కోసం మీ వెంట 40 రోజుల పాటు తిరుగుతూ పని చేశామని వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్నంతా సెల్​ఫోన్​లో చిత్రీకరిస్తున్న విలేకరిపై ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దురుసుగా ప్రవర్తించారు. సెల్​ఫోన్ (CellPhone)​ కింద పడేశారు. మరోవైపు ఆయన కుమార్తె కృపా లక్ష్మి స్థానిక నేతలతో కలిసి గడపగడపకు పర్యటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నిస్తూ... అవి ఎవరిస్తున్నారు అంటూ అడుగుతూ వారి గుర్తు ఏదని ప్రశ్నించడంతో మహిళ సైకిల్(Bicycle) గుర్తు అని చెప్పడంతో నేతలు అవాక్కయ్యారు. ఇదే క్రమంలో రాచ రంగన్న పల్లెలో ఓ మహిళ మాట్లాడుతూ సర్పంచులు లక్షలాది రూపాయలు అప్పు చేసి వీధిన పడ్డారని, వారికోసం ఉప ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావ్ అంటూ మీడియా ఎదుట ప్రశ్నించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.