వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ - Sharif to take action against followers of Suresh

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 9:59 PM IST

Sharif Complained to Guntur District SP : గుంటూరులో నౌషాద్ కుటుంబాన్ని మోసం చేసిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ డిమాండ్ చేశారు. లాలపేటకి చెందిన నౌషాద్ కుటుంబం వద్ద నందిగం సురేష్ అనుచరుడు సన్నీ రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేయడంతో అతను ఆత్మహత్యకు యత్నించారు. దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ షరీఫ్ ఇవాళ గుంటూరు జిల్లా ఎస్పీ హఫీజ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. 

నౌషాద్ ఆత్మహత్యాయత్నం చేసి వారం రోజులు గడిచిన అధికారులు, పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. డబ్బు తీసుకొని మోసం చేసింది కాక తిరిగి వారి పైనే పరువు నష్టం కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. వైసీపీ నాయకులకు బుద్ది చెప్పే రోజులు సమీపంలోనే ఉన్నాయని హెచ్ఛరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఇంచార్జీ మహ్మద్ నసీర్​తో పాటు తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.