Boy Committed Suicide by Hanging స్థానికులను కన్నీళ్లు పెట్టించిన బాలుడు ఆత్మహత్య..! - Seventh class boy suicide in Nandyala district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 7:41 PM IST

Seventh Class Boy Committed Suicide by Hanging: ఏడో తరగతి చదువుతున్న బాలుడు ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డోన్​ పట్టణంలో సుభాషిని అనే మహిళ రూరల్ పోలీస్ స్టేషన్ సమీప కాలనీలో ప్రణీత్, శ్రావణి అనే ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. ప్రణీత్​ (12) పట్టణంలోని పాతపేటలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లి తిరుపతికి వెళ్లిన సమయంలో బాలుడు ఇంట్లోని బెడ్​రుమ్​లో ఫ్యాన్​కి ఉరివేసుకున్నాడు. ప్రణీత్ రూమ్ నుంచి ఎంతసేపటికి రాకపోవడంతో చెల్లి గట్టిగా కేకలు వెయగా చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్​కు వేలాడుతున్నాడు.. ప్రణిీత్​ని కిందకు దించి చూసే సరికి అప్పటికే మృతి బాలుడు చెందాడు. చుట్టుపక్కల వారు తల్లికి, పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడు స్వయంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అని చుట్టుపక్కల వారితో పోలీసులు విచారణ చేపట్టారు. తల్లి మరొకరితో సహజనం చేస్తుందన్న అనుమానంతో బాలుడు కలత చెంది ఈ ఆత్మహత్యకు పాల్పడడా అనే అనుమానాలకు దారితిస్తోందని స్థానికులు అంటున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.