Secret Inquiry on Fake Voters at Uravakonda: ఉరవకొండలో నకిలీ ఓట్లు.. రహస్య విచారణపై పలు పార్టీల అభ్యంతరం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 5:24 PM IST

thumbnail

Fake Voter list Secret Inquiry at Uravakonda : నకిలీ ఓటరు జాబితాపై రహస్యంగా విచారణ జరపడంలో ఆంతర్యం ఏమిటని.. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదు అధికారిని ఆయా పార్టీల నాయకులు నిలదీశారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి శంకరయ్య అధ్యక్షతన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితాను తమకెందుకు ఇవ్వరని పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు.

గతేడాది జనవరి 6 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 5,356 నకిలీ ఓట్లు.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 9 వరకు 239 నకిలీ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వాటిపై విచారించాలని ఎన్నికల సంఘం అదేశించినట్లు ఈఆర్వో చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే బీఎల్వోలతో విచారణ ప్రారంభించామని ఈఆర్వో వెల్లడించారు. జాబితాను తమకెందుకు ఇవ్వరని, కేవలం రెండు పార్టీలకే సమాధానమిస్తూ.. మిగతా పార్టీలను విస్మరిస్తున్నారని సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీల నాయకులు ఈఆర్వోను నిలదీశారు. ఈ క్రమంలో అధికారులు, నాయకుల మధ్య వాగ్వాదం జరగడంతో ఎస్‌ఐ కలగజేసుకుని వారిని శాంతింపజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వలేమని అన్నారు. ఆయా పార్టీల బీఎల్వోల సమక్షంలోనే సమర్థంగా విచారణ జరిపిస్తామని ఈఆర్వో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.