'ఇదీ మన సంస్కృతి' - సంక్రాంతి ముందస్తు వేడుకల్లో చిన్నారుల సందడి
🎬 Watch Now: Feature Video
Sankranti Celebrations at Schools in Konaseema District: సంస్కృతి సంప్రదాయాలకు, అనుబంధం ఆత్మీయతలకు ప్రతీకగా చిన్నాపెద్ద అంతా కలసి జరుపుకొనే పండుగ సంక్రాంతి. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి విచ్ఛిన్నమై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితులు మారిపోయిన నేటి తరుణంలో పట్టణాల్లో సంక్రాంతి శోభ తక్కువనే చెప్పాలి. కానీ, పల్లెల్లో సందడి ఏ మాత్రం తగ్గలేదు. పట్టణాల నుంచి సొంత ఊళ్లకు తిరిగి వస్తుండడంతో పల్లె కనువిందు చేస్తోంది. కోనసీమ జిల్లాలో పాఠశాలలు, కార్యాలయాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలతో సందడి నెలకొంది.
పాఠశాలల్లో ముందస్తు వేడుకలు జిల్లాలోని ప్రైవేటు పాఠశాల్లో నిర్వహించిన సంబరాల్లో చిన్నారులంతా సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణంలో రంగు రంగుల ముగ్గులు వేశారు. కోలాటాలు, ఎడ్ల బండిపై ఊరేగుతూ విద్యార్థులు సందడి చేశారు. బొమ్మల కొలువులు, పిండి వంటలు, భోగి మంటలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఉపాధ్యాయుల చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. కోలాటాలు, ఎడ్ల బండిపై ఊరేగుతూ సందడి చేశారు. బొమ్మల కొలువులు, పిండి వంటలు, భోగి మంటలతో జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది.