పాఠశాలల్లో సంక్రాంతి కోలాహలం- రంగవల్లులు, ఆటపాటలతో విద్యార్థుల సందడి
🎬 Watch Now: Feature Video
Sankranti Celebrations at School: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. చిన్నాపెద్దా అంతా కలిసి రంగవల్లులు, పిండివంటలు, ఆటపాటలతో సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని నిర్వహిస్తారు. చాలామంది సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ అనే అనుకుంటారు. ఆ మూడు రోజులపాటే సంబరాలు జరుపుకొంటారు అయితే ఇటీవల కాలంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరందుకున్నాయి.
పాఠశాలలు, కార్యాలయాలు ఇలా చాలా చోట్ల ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా చినగంజాం మండలం మున్నంవారిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓ వైపు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల కళాకారుల వేషధారణలతో విద్యార్థులు సందడి చేశారు. పట్టు పరికిణీలలో చిన్నారులు, భోగి మంటలతో పాఠశాల ప్రాంగణమంతా సంక్రాంతి శోభ నిండుకుంది. రంగవల్లులు తీర్చిదిద్ది చిన్నారులు కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులకు పండుగ విశిష్టత తెలియాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు.