కొనసాగిన సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళనలు- కళ్లకు గంతలు కట్టుకొని, పవ్వులు చేవిలో పెట్టుకుని నిరసనలు - Sarva Siksha Abhiyan contract staff state protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 10:08 PM IST
Samagra Shiksha Employees Protest in Prakasam District : సమగ్ర శిక్ష ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నాలుగో రోజు సమ్మె కొనసాగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన చేపట్టారు.పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనం, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా కంభంలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన చెందారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాలన్నరు. నాలుగు రోజుల నుంచి వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్న ప్రభుత్వం కళ్లులేని ద్రుతరాష్ట్రుడిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.