YCP STICKER REMOVED: ఎలాంటి పథకాలు అందలేదు.. స్టిక్కర్ ఎలా అంటిస్తారు?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 15, 2023, 4:10 PM IST

వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సంక్షేమ పథకాలు అందిన వారి ఇళ్లకు 'మా నమ్మకం నువ్వే జగనన్న' అనే ట్యాగ్ లైన్​ ఉన్న స్టిక్కర్​ను అంటిస్తున్నారు. కానీ కొందరికి సంక్షేమ ఫథకాలు అందకపోయినా.. వారి అనుమతి లేకుండానే స్టిక్కర్​ను అంటిస్తున్నారు. కానీ ఓ కుటుంబ సభ్యలు ధైర్యం చేసి దీనిపై స్పందించారు. 'జగన్ వద్దు.. స్టిక్కర్ వద్దు ఓటు వేయం' అని ఓ కుటుంబ సభ్యులు నిక్కచ్చిగా చెప్పారు.  

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు తమ అనుమతి లేకుండా స్టిక్కర్ అతికించారని, జగన్ ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని కనీసం రేషన్ కార్డు కూడా లేదని, దీంతో పిల్లలకు అమ్మ ఒడి, తన తల్లికి ఆర్థిక సాయం, ఇళ్లు కూడా మంజూరు చేయలేదని నిరసిస్తూ సలీం భాష అనే యువకుడు తన ఇంటికి అతికించిన 'మా నమ్మకం నువ్వే జగనన్న' స్టిక్కర్​ను తొలగించాడు. సలీం భార్య, అతని తల్లి కూడా మాట్లాడుతూ జగనన్న నవరత్నాల్లో ఒక్క రత్నం కూడా అందలేదని, ఇళ్లు లేక అవస్థలు పడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో ఫ్యానుకు ఓటు వేయమని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.