Tension in Municipal meeting: అక్రమాలపై గళమెత్తిన అధికార పక్షం.. రసాభాసగా మున్సిపల్ సమావేశం - అధికార పార్టీ నేతల మధ్య గొడవలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 28, 2023, 9:20 PM IST

Ruckus Atmakuru Municipal Meeting: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఛైర్ పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. అధికార పార్టీ కౌన్సిలర్ల పోరు మధ్య సమావేశం రసాభాసగా ముగిసింది. స్దానిక సమస్యలపై 20 వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి గళమెత్తారు. మున్సిపాలిటీలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరించేందుకు  కనీసం బుట్టలు, చీపుర్లు సైతం లేవని తెలిపాడు.  చెత్తను తరలించేందుకు వాహనాలు కూడా లేకపోవటం దారుణమని పేర్కొన్నాడు. సంచుల్లో చెత్తను తరలిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో బ్లీచింగ్ చల్లడానికి గ్లౌజులు ఇవ్వకపోవటంతో సిబ్బంది చేతులకు.. అయిన ఆ గాయాల ఫొటో చూపుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మున్సిపాలిటీ పరిదిలో అభివృద్ధి పనులన్ని ఎమ్మెల్యే  బావమరిదికి ఇవ్వటంపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవ వార్డు కౌన్సలర్ శివకోటా రెడ్డి మాట్లాడుతు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఔట్​లు అధికమయ్యాయని, వాటిని కట్టడి చేటయటంలో అధికారులు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని పేర్కొన్నాడు. లేఔట్లలో అక్రమాలపై అధికారులను ప్రశ్నించినా మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు.   

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.