ఆర్టీసీ డిపోలో ఎండీ ఆకస్మిక తనిఖీ - సమస్యలు 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2023/640-480-19931983-thumbnail-16x9-rtc--md-sudden-inspection-in-busstand.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 5:36 PM IST
RTC MD Sudden Inspection in Bus stand: రాష్ట్రంలో 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఎపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మరో 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్పులు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.
1500 diesel, 1000 electrical buses Trying to Make Available: ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు ఆర్టీసీ ఎండీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ డిపోలో సమస్యలను.. అక్కడ సిబ్బంది, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో గుర్తించిన సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్టాండ్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. తాగునీరు, టాయిలెట్స్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.