వంతెనపై ఆగిన రైలు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంతో - చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ లో ప్రమాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2023/640-480-18868543-709-18868543-1687960783602.jpg)
CRPF constable repaired: తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు కాళంగి నది వంతెనపై... హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది. రైలు వంతెనపై వెళ్తున్న సమయంలో.. ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చైన్ లాగటంతో రైలు అక్కడే నిలిచిపోయింది. వంతెన మీద ఉన్న రైలు ముందుకు కదలాలంటే ఎయిర్ వాల్ మూత వేస్తేనే ఆ రైలు ముందుకు వెళ్తుంది. అదే సమయంలో ఆ వంతెనపై ఇతర ట్రైన్స్ వస్తాయేమో అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. వంతెనపై బోగి వద్దకు వెళ్లలేని పరిస్థితిలో.. ఎయిర్ వాల్ మూత వేసేందుకు ఎస్కార్ట్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించారు. వంతెన కింద మరమ్మతులు చేస్తున్న ప్రొక్లెయిన్ డ్రైవర్ సాయంతో కానిస్టేబుల్ వంతెనపైకి ఎక్కి ఎయిర్ వాల్ మూత బిగించారు. కానిస్టేబుల్ చొరవతో 22 నిమిషాల వ్యవధిలోనే రైలు ముందుకు కదిలింది. రైలు ముందుకు కదలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతాధికారులు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రాహుల్‌ను అభినందించారు.