Revenue Employees Association Leaders meet Chief Electoral Officer: 'రెవెన్యూ ఉద్యోగులపై ఎన్నికల కార్యక్రమాల ఒత్తిడి లేకుండా చూడండి' - ఏపీ ఎన్నికల అధికారిగా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 9:33 PM IST
AP Revenue Employees Association Leaders meet AP Chief Electoral Officer: ఓటరు జాబితాల రూపకల్పన, సవరణ అంశాల్లో రెవెన్యూ ఉద్యోగుల్లో ఒత్తిడి తేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు కలిశారు. ఓటర్ నమోదు, సవరణ కార్యక్రమాల్ని రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా, సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ ఉద్యోగులు కోరారు. ఓటర్ల నమోదు, సవరణ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ రీ-సర్వే విధులకు సంబంధించి ఎటువంటి టార్గెట్లు పెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ రెవెన్యూ విధులు మినహా, ఇతర విధులు, ఇతర శాఖల విధులు తహశీల్దార్లకు కేటాయించవద్దనీ రెవెన్యూ అసోసియేషన్ కోరారు. స్పెషల్ సమ్మరీ రివిజన్-2024 షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు తగినంత సమయం ఇవ్వాలనీ సీఈఓకి విజ్ఞప్తి చేశారు. 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఖర్చుపెట్టిన కొన్ని జిల్లాల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదనీ స్పష్టం చేశారు.