రుషికొండపై ఏపీటీడీసీ ఉల్లంఘనలకు పాల్పడింది: కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ లేఖ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 3:13 PM IST

Retired IAS Sharma Letter on Rushikonda : రుషికొండపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యదర్శి లీలానందన్‌కు విశ్రాంత ఐఏఎస్ (IAS) అధికారి ఈఏఎస్ శర్మ లేఖ రాశారు. సీఆర్​జడ్​ పరిధిలో  ఏపీటీడీసీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు లేఖలో స్పష్టం చేశారు. రుషికొండపై నిర్మించిన భవనాలు పర్యాటకులకు కాకుండా సీఎం కార్యాలయం ఏర్పాటుకేనని స్పష్టమైందన్నారు. వాటిని పర్యాటకుల కోసం కాకుండా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదన్నారు. కొచ్చి మరడు ప్లాట్ల విషయంలోనూ భవనాల కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశించిందని శర్మ గుర్తు చేశారు. మరడు ప్లాట్ల యజమానులకు ఒక నియమం.. ఏపీటీడీపీసికి మరో నియమమా అని ప్రశ్నించారు. నిన్నటి హైకోర్టు తీర్పును జతచేస్తూ ఈఏఎస్ శర్మ కేంద్రానికి లేఖ రాశారు.

రుషికొండపై అక్రమంగా తవ్వకాలు, భవనాలు నిర్మించారని హైకోర్టు నియమించిన కమిటీ... తన నివేదికను గతంలోనే సమర్పించింది.  అనుమతికి మించి కట్టడాలున్నాయని నియామక కమిటీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఆయా నిర్మాణాలపై మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అటవీ, పర్యావరణశాఖకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా.. కేసు విచారణను హైకోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.