నాటుసారా కేసులో రిమాండ్‌ మహిళా ఖైదీ మృతి - ఆందోళనకు దిగిన కుటుంబం - రిమాండ్‌ ఖైదీదళిత మహిళ ఆసుపత్రిలో మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 12:27 PM IST

Remand Prisoner  Lady Died In Kakinada District : కాకినాడ జిల్లా తునిలో నాటుసారా కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న దళిత మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆబ్కారీ (Excise) స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. కొండవారిపేటకి చెందిన పెదపాటి దాసు గతంలో ప్రమాదానికి గురై ఇంటి వద్దే ఉంటున్నాడు. అతని వద్ద సారా ప్యాకెట్లు దొరకడంతో అరెస్టు చేయడానికి ఆబ్కారీ పోలీసులు అతని నివాసానికి వెళ్లారు. 

భర్త ఆరోగ్యం బాగోలేదని తనపై కేసు పెట్టాలని భార్య రత్నం అబ్కారీ అధికారులను కోరడంతో డిసెంబర్‌ 9న రత్నంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించగా కుటుంబ సభ్యులు వెళ్లే సరికే ఆమె మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎస్‌ఈబీ (special enforcement bureau) పోలీసు స్టేషన్‌ వద్దకు తరలించి అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.