Red Sandal Smugglers భారీగా ఎర్రచందనం.. పోలీసుల అదుపులో తమిళనాడు, కర్ణాటక,కేరళ స్మగ్లర్లు - sandalwood smuggling in AP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2023/640-480-18836333-1081-18836333-1687604639086.jpg)
Red Sandal Smugglers Arrested: తిరుపతి జిల్లా భాకరాపేట సమీపంలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. భాకరాపేట పోలీసులకు అందిన సమాచారం వరకు యల్లమంద క్రాస్ వద్ద అనుమానస్పదంగా కదలికలో ఉన్న వాహనాలను, వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారించే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నామన్నారు.
9 మంది నిందితులతో పాటు సుమారు రెండు కోట్ల విలువ చేసే 33 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు తరలించేందుకు చూశారని ఎస్పీ పరమేశ్వర రెడ్డి అన్నారు. బెంగళూరులో మరో ఇద్దరు ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలేనే వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. పట్టుబడిన నిందితులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించామని, వీరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.