Murthy Yadav fire on YSRCP: ఎర్రమట్టి దిబ్బలపై పడ్డారు.. కోర్టుకెళ్తాం: మూర్తి యాదవ్ - red sand hills
🎬 Watch Now: Feature Video
Murthy Yadav fire on YSRCP about Erra Matti Dibbalu: దేశవ్యాప్తంగా పేరొందిన ఎర్రమట్టి దిబ్బల ఉనికిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా విశాఖపట్నం నగర పట్టణాభివృద్ధి సంస్థ.. భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. దీనిపై విశాఖ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎర్రమట్టి దిబ్బలలో లే అవుట్లు వేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని విశాఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న దిబ్బలు.. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అసమర్ధ విధానాలతో ప్రస్తుతం 80 ఎకరాలకు పరిమితం అయ్యాయని మండిపడ్డారు. ఈ భూసమీకరణ నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని తెలిపారు. అదేవిధంగా ఐఎన్ఎస్ కళింగ.. దేశానికి భద్రతాపరంగా అత్యంత కీలకమైన ప్రాంతమని.. దాని పక్కనే లే అవుట్ వేయటం దేశభద్రతకు ప్రమాదం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోని పక్షంలో న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.