Re installation of statues at Nandigama: 'వేదిక'పైకి చేరిన ప్రముఖుల విగ్రహాలు.. మున్సిపల్ అధికారుల వైఖరిపై విమర్శలు - Re installation of statues at Nandigama
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 5:19 PM IST
Re installation of statues at Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇటీవల వివాదాస్పదరీతిలో తొలగించిన జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను.. నూతన ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోని వేదికపైకి చేర్చారు. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు.. గాంధీ సెంటర్లోని 14 మంది ప్రముఖుల విగ్రహాలను మున్సిపాలిటీ వారు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తొలగించడం వివాదాస్పదమైంది. అనంతరం అంబేడ్కర్, ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ తదితరుల విగ్రహాలను.. మున్సిపల్ కార్యాలయంలోని మరుగుదొడ్ల పక్కన పెట్టడంతో ఆందోళనలు వెల్లువెత్తాయి. గుట్టు చప్పుడు కాకుండా విగ్రహాలను కనీసం ఎవరికీ తెలియజేయకుండా హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తీసుకొచ్చి ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కానీ ఇదే సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రం అక్కడి నుంచి తొలగించలేదు. ఆ ఒక్క విగ్రహం ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో అక్కడే ఉంచాలరని పలువురు ఆరోపిస్తున్నారు.