పెద్దప్రోలు దగ్గర లారీ బీభత్సం - పలు వాహనాలు ధ్వంసం - మోపిదేవి రోడ్డు పై లారీ ఆక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 6, 2023, 4:38 PM IST
Ration Lorry Hit Kikes in Mopidevi : కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు వద్ద ద్విచక్రవాహనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనదారులు ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. పెదప్రోలు వద్ద జాతీయ రహదారిపై వర్షం కురిసిన కారణంగా వాహనదారులు వాహనాలను పక్కన నిలిపి దగ్గరలో ఉన్న బస్ షెల్టర్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో మోపిదేవి నుంచి చల్లపల్లి వెళ్తున్న రేషన్ లారీ అటువైపుగా దూసుకొచ్చింది. అదుపు తప్పిన ఆ లారీ సరాసరి నిలిపివున్న ఆరు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా తీవ్రభయాందోళనకు గురైయారు.
Bikes Distroyed Due to Lorry Accident : ఈ ప్రమాదంలో తన బండి మొత్తం రెండు ముక్కలుగా అయ్యిందని ఓ మహిళ వాపోయారు. బస్సును ఓవర్టేక్ చేయడం వల్ల అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులకు డ్రైవర్ అబద్దం చెప్పారన్నారు. దాదాపు అక్కడున్న బైక్‌లన్నీ ధ్వంసం అయ్యాయని బాధిత వాహనదారులు తెలిపారు. వర్షం పడుతున్నందున వాహనదారులు అక్కడ లేకపోవడంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.