Radiation Oncologists State Level Meeting: జీఎస్​ఎల్ వైద్య కళాశాలలో ముగిసిన ఆంకాలజిస్టుల రాష్ట్ర స్థాయి సమ్మేళనం - radiation oncologists of india conference

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2023, 7:34 PM IST

Radiation Oncologists State Level Meeting: రాజమహేంద్రవరంలోని జీఎస్​ఎల్ వైద్య కళాశాలలో (GSL Medical College) రెండు రోజులపాటు నిర్వహించిన ఆంకాలజిస్టుల రాష్ట్ర స్థాయి నాలుగో సమ్మేళనం (AP AROICON 2023) ముగిసింది. అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ ఆఫ్ ఇండియా (Association of Radiation Oncologists of India) ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనంలో క్యాన్సర్ నియంత్రణలో ప్రాచుర్యం పొందుతున్న ప్రొటాన్ థెరపీపై (Proton Therapy) వైద్యులు విస్తృతంగా చర్చించారు. క్యాన్సర్ నివారణలో రేడియేషన్ థెరపీలో ఎదురయ్యే సనాళ్లు, పరిష్కారాలపై డాక్టర్లు పేపర్ ప్రజెంట్ చేశారు. వారి అనుభవాలను పంచుకున్నారు. రేడియేషన్ ఆంకాలజీలో ఒక స్పెషాలిటీ అయిన ప్రోటాన్ థెరపీ చాలా ఖర్చుతో కూడినదని ప్రభుత్వ రంగంలో ఈ యూనిట్​ను నెలకొల్పడం వలన మధ్యతరగతి వారికి కూడా ప్రోటాన్ ధెరపీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది క్రమంగా దేశమంతటా విస్తరిస్తుందని జీఎస్ఎల్ వైద్య కళాశాల రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజునాయుడు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న రేడియేషన్ ఆంకాలజిస్టులు ఈ సమావేశంలో పాల్గొని.. తమ అనుభవాలు పంచుకున్నామని జీఎస్ఎల్ వైద్య కళాశాల రేడియేషన్ ఆంకాలజీ శాఖ అధిపతి డాక్టర్ ఆనందరావు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.