Huge Python in Prakasam District ప్రకాశం జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్ వద్ద కొండచిలువ కలకలం - కొండచిలువ కలకలం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 11:03 AM IST
Huge Python in Prakasam District : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెంకటేశ్వర అపార్ట్మెంట్ వద్ద కొండచిలువ కలకలం రేపింది. అపార్ట్మెంట్ రహదారిన వెళ్ళే స్థానికులు 9 అడుగుల భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి వచ్చి కొండచిలువ ను పట్టుకున్నారు. దానిని అడవిలో విడిచిపెట్టనున్నట్లు స్నేక్ క్యాచర్ మల్లిఖార్జున తెలిపాడు. పారిశుధ్య పనుల లోపం వలన తరచూ ఇలా ఇళ్ళ మధ్యకు పాములు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. వర్షాలు ఎక్కువ కావడం వల్ల పాములు బయటకు వస్తున్నాయని, రాత్రి వేళల్లో తగి జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ వారు సూచిస్తున్నారు.
python in Tirumala : తిరుమలలో భారీ కొండచిలువ హాల్ చల్ చేసింది.. స్థానికులు నివాసముండే బాలాజీ నగర్లో ఓ ఇంటి ముందు 12 అడుగుల కొండచిలువ నక్కింది. పామును చూసిన ఇంటి యజమానులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అటవీశాఖ ఉద్యోగికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడ చేరుకొన్న అటవీశాఖ ఉద్యోగి చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలివేశారు.