వైభవంగా శ్రీ పైడితల్లి జాతర.. అమ్మవారి ఘటాలతో మొక్కులు - ap news
🎬 Watch Now: Feature Video
Pydithalli Ammavari Jathara: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు.. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర విశాఖలో ఘనంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చారు. తమ కోర్కెలు తీర్చమని కొందరు ఘటాలను మోస్తే.. మరికొందరు ఏమో తమ కోర్కెలు తీరడంతో మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో విశాఖపట్నం పైడితల్లి అమ్మవారి జాతరతో పులకించిపోయింది. సోమవారం రాత్రి మొదలైన ఈ జాతర మంగళవారం కూడా కొనసాగుతోంది. సుమారు నాలుగు వందల యాబైకి పైగా అమ్మవారి ఘటాలను తలపై పెట్టుకుని భక్తులు ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం నుంచి దుర్గాలమ్మ గుడి మీదుగా కంచరపాలెం వరకు ఆధ్యాత్మిక యాత్ర చేశారు. దారి పొడుగునా అమ్మవారి ఘట్టాలకు సాంబ్రాణి దూపం వేస్తూ, దీపపు వెలుగుల మద్య యాత్ర కొనసాగింది. వేలాది భక్తులు నడుచుకుంటూ కంచరపాలెం పైడితల్లి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి అంతా జాతర చేసి మంగళవారం ఉదయం మళ్లీ అమ్మ వారికి పూజలు చేస్తారు.