బీజేపీ ప్యాకెట్ డైరీని ఆవిష్కరించిన పురందేశ్వరి - BJP NEWS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:36 PM IST
Purandeswari Lunched BJP Packet Diary: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న పథకాల వివరాలకు సంబంధించి బీజేపీ నేత కిలారు దిలీప్ రూపొందించిన ప్యాకెట్ డైరీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆవిష్కరించారు. బీజేపీ ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన వివరాలను డైరీలో సంక్షిప్తంగా పొందుపరిచారమని, ఇది అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె వెల్లడించారు.
Purandeswari Comments: ''కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి మా పార్టీ సీనియర్ నాయకులు కిలారి దిలీప్ రూపొందించిన ప్యాకెట్ డైరీని ఈరోజు ప్రారంభించాం. ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాల గురించి డైరీలో సంక్షిప్తంగా పొందుపరిచాం. ఇది అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దళిత, మహిళా, బీసీ మోర్చాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రజలకు ప్రచారం చేస్తున్నాం. 'వికసిత భారత్ సంకల్ప యాత్ర' ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నాం. అర్హత ఉండి, లబ్ధి పొందకపోతే, వారి నుంచి అక్కడికక్కడే దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేస్తున్నాం. పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలు రాబోతున్నారు. ఆ తేదీలను త్వరలో వెల్లడిస్తాం.'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.