కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయి: పురందేశ్వరి - purandeswari comments about central funds
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/640-480-19965439-thumbnail-16x9-purandeswari-central-university-construction-visit.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 4:40 PM IST
Purandeswari Central University Construction Visit: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు అందజేసి పథకాలు అమలు చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్టిక్కర్లు తగిలించుకుని అంతా తామే చేస్తున్నట్లు ఆర్భాటాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయడానికే ఇవాళ పర్యటన చేపట్టామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ ప్రభుత్వం చేస్తుందో గమనించాలన్నారు. అనంతపురం జిల్లాలోని జంతులూరు సమీపంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
మొత్తం 711 కోట్ల రూపాయల వ్యయంతో యూనివర్సిటీ నిర్మాణాన్ని కేంద్రం చేపట్టిందని పురందేశ్వరి వివరించారు. రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం, విద్యార్థులకు అన్ని వసతులతో యూనివర్సిటీ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. 491 ఎకరాల్లో నిర్మాణం జరుగుతోందని, భూమి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, మిగతా పనులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, విపక్షాలు ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన యూనివర్సిటీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న దాంట్లో అతిశయోక్తి లేదని పురందేశ్వరి చెప్పారు.