Purandeshwari Comments on Fake Votes: ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం కమిటీలు: పురందేశ్వరి - Purandeshwari comments on fake votes
🎬 Watch Now: Feature Video
Purandeshwari Comments on Fake Votes: రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పక్షాల్లోనూ, ప్రజల్లోనూ.. అలజడి రేపుతోన్న ఓటర్ల జాబితా అంశాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓటరు అవగాహనపై రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులున్నాయని.. ఒకే ఇంటి నెంబరుతో భారీగా ఓట్ల నమోదు వంటి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సామాన్యుల చేతిలోని గొప్ప ఆయుధంగా ఉన్న ఓటును సక్రమంగా ప్రజలందరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
Irregularities in voter list in AP: ఓటర్ల జాబితాలో అవకతవకలపై గతంలోనూ ఆరోపణలున్నాయని.. ఇప్పుడు మరింత అధికమయ్యాయన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలపై ఉరవకొండలో ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురి కావడం వంటి విషయాలను పార్టీ కమిటీలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, బూత్‌స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో నిబంధనలకు విరుద్దంగా చేరికలు.. తీసివేతలు జరుగుతున్నాయని.. వాలంటీర్లు పంపిన సమాచారాన్ని క్రోడికరించి అవకతవకలకు పాల్పడేందుకు హైదరాబాదులో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారని వివరించారు.