Save AP Aganist BJP: రాష్ట్రాన్ని కాపాడేందుకు బీజేపీని ఒంటరి చేయాలి: ప్రజాసంఘాలు - Anti BJP states
🎬 Watch Now: Feature Video
Public associations Media conference: రాష్ట్రాన్ని కాపాడేందుకు బీజేపీని ఒంటరి చేయాలని ప్రజాసంఘాలు, వివిధ రంగాల ప్రముఖులు పిలుపునిచ్చారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అండతో బలపడాలని బీజేపీ పన్నాగం పన్నుతోందని.. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు, మేథావులపై ఉందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని.. దాన్ని తిరస్కరించడం తప్పు అన్నారు. విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిందని.. వీటిలో ఎక్కువ భాగం ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
ఉమ్మడి ఆస్తుల పంపకం జరపలేదని.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకపోగా ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకుంటోందని.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని ఉందా లేదా అన్నట్లుందని.. రెవెన్యూ లోటుకు ఇవ్వాల్సిన నిధులు సైతం ఇప్పటికీ ఇవ్వడం లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టారని.. పాడి రంగంలో సహకార రంగాన్ని దెబ్బతీసేలా అమూల్‌కు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద పార్టీగా బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.