మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి అంగన్వాడీల యత్నం - అడ్డుకున్న పోలీసులు - Anganwadis protest
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 2:53 PM IST
Protest from Anganwadis to Minister Peddireddy: తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అంబేడ్కర్ భవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన అంగన్వాడీలను, వెస్ట్ చర్చి కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు. రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు. రోడ్డుపైనే బైఠాయించిన అంగన్వాడీలు, సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు మూడు వారాలుగా సమ్మె చేస్తున్నా, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంటూ ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నా, ఏ ఒక్కరూ తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇప్పటికే అంగన్వాడీలతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపింది. అయితే అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. వారి ప్రధాన డిమాండ్ అయిన జీతాల పెంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు.