Protest against YCP leaders: సమస్యలు పట్టించుకోకుండా గాలికొదిలేశారు.. నేదురుమల్లి రామ్​కుమార్​ రెడ్డికి నిరసన సెగ - tirupati news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2023, 5:34 PM IST

Gadapa Gadapaku mana prabhutvam program: తిరుపతి జిల్లా వెంకటగిరిలో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. తమ సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని స్థానికులు విమర్శించారు. వార్డుల్లోని మురికి కాల్వల్లో చెత్త పేరుకుపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే డ్రైనేజీ కాల్వలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. కాని ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేరలేదని ఆగ్రహించారు. 12వ వార్డులో 90 ఏళ్ల వృద్దురాలికి పింఛన్‌ తొలిగించటంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయ నగర్​లో పర్యటించిన రాంకుమార్​కు మహిళ నుంచి ఊహించని రీతిలో నిరసన ఎదురైంది. జగనన్న మన నమ్మకం అంటూ మహిళకు కరపత్రం ఇవ్వబోయిన ఆయనకు.. మహిళ నుంచి నిరాదరణ ఎదురైంది. ఆయనపై నమ్మకం పెట్టుకున్నాక ఏమి జరిగిందని అంటూ ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.