Protest To MLA Kaile Anil Kumar: మేము గుర్తున్నామా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు - కృష్ణా జిల్లా నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
Protest To MLA Kaile Anil Kumar : కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్కు నిరసన సెగ తగిలింది. తమ ప్రాంతానికి రోడ్లు వేయాలని నాలుగేళ్లుగా మొర పెట్టుకుంటున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సురసానిపల్లె హరిజన వాడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మొవ్వ మండల పర్యటనకు అనిల్ కుమార్ వస్తున్నారనే సమాచారం తెసుసుకున్న మహిళలు ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున మొవ్వ చేరకున్నారు. ఎమ్మెల్యే కారును నడిరోడ్డుపై అడ్డుకున్నారు.
గత ఎన్నికల్లో తమ పల్లె మొత్తం వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి తప్పు చేశామని, ఈసారి మళ్లీ ఓట్లు అడగటానికి రమ్మంటూ మహిళలు సవాలు విసిరారు. తమ సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదంటూ మహిళలు నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేను నిలదీశారు. గెలిచి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా తమ గ్రామానికి ఎందుకు రాలేదని, అసలు మేము గుర్తున్నామా అంటూ ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇరుగు పొరుగు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే, తమ ఊరు ఎందుకు రాలేదంటూ నిలదీయడంతో, ఒకానొక దశలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మహిళలపై అసహనం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం దండాలు పెట్టి తిరిగిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు తీరిక లేకుండా పోయిందని మహిళలు మండిపడ్డారు. దీనస్థితిలో ఉన్న తమ గ్రామ రోడ్ల సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.