Protest against MLA "ఈ రోడ్లపై ప్రయాణించి.. గర్బిణీలు, పేషంట్లు ప్రాణాలు వదులుతున్నారు' - AP Latest News
🎬 Watch Now: Feature Video
Protest against MLA in Gadapa Gadapa program: కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌కు నిరసన సెగ తలిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చనుగొండ్ల గ్రామంలో పర్యటిస్తున్న ఆయనను సీపీఐ నేతలతో కలిసి గ్రామస్థులు అడ్డుకున్నారు. గూడూరు చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు ఉన్న రహదారిని వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. గూడూరు నుండి చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతలమయం అయిందని.. ఈ రోడ్డు ఏళ్ల తరబడి ఇలానే ఉందికాని దీని నిర్మాణ పనులు అధికారులు గాని, పాలకులు గాని చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చనుగొండ్ల గ్రామంలో గర్భిణీలు బాలింతలు, పేషెంట్లు, ఈ రోడ్డు మార్గంలో హాస్పిటల్‌కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. పేషెంట్లకు ఎమర్జెన్సీ ఏర్పడితే ఈ రోడ్డు మార్గంగా వెళ్లి హాస్పటల్ చేరేలోపు ప్రాణాపాయ స్థితి ఏర్పడొచ్చని అన్నారు.
రెండు మండలాలను కలిపే ఈ రహదారిని పాలకులు విస్మరించారని.. మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేశారుకాని చనుగొండ్ల గ్రామానికి మాత్రం రోడ్లు వేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున వెంటనే గూడూరు చనుగొండ్ల మీదుగా కోడుమూరుకు రహదారి పనులు వెంటనే చేపట్టి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. దీంతో స్పందించిన.. ఎమ్మెల్యే సుధాకర్ స్పందిస్తూ రోడ్డు శాంక్షన్ అయిందని టెండర్ల ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తిచేసి రోడ్డు నిర్మాణం పనులు చేపడతామని హామీ ఇచ్చారు.