రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న మోదీ- షెడ్యూల్ ఖరారు - pm modi ap visits on november
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 10:49 AM IST
Prime Minister Narendra Modi Two Day Visit to State Finalized : రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యాటన ఖరారైంది. ఈ నెల 26,27 తేదీల్లో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. 26వ తేదీ సాయంత్రం ప్రధాని తిరుపతికి చేరుకుంటారు. 27వ తేదీన మోదీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నాారు.
Modi will visit Tirumala Venkateshwara Swam i: నరేంద్ర మోదీ 26వ తేదీ సాయంత్రం 5.45 నిమిషాలకు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి తిరుపతికి రానున్నారు. 6:50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి శ్రీ రచన అతిథి గృహానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం 9.30 గంటల వరకూ తిరుమలలోనే గడపనున్నారు. 10:30 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకొని తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు.