Praveen Prakash Sudden Inspection సెప్టెంబర్ సిలబస్ ను ఇప్పుడు బోధిస్తారా..? టీచర్లు, అధికారుల పనితీరుపై ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం..
🎬 Watch Now: Feature Video
Praveen Prakash Sudden Inspection: అనంతపురం జిల్లాలో విద్యాశాఖ అధికారుల తీరుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా... నేడు నగరంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు.. విద్యార్థులకు ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారన్నది దగ్గరుండి చూశారు. అయితే గణితం బోధించాల్సిన ఉపాధ్యాయులు తెలుగు చెప్పడం... తెలుగు బోధించాల్సిన ఉపాధ్యాయులు గణితం చెప్పడాన్ని గుర్తించారు.
సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాల్సిన సిలబస్ ను ఇప్పుడు బోధిస్తుండటంపై ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈఓ(MEO), డీఈఓ(DEO) ఏం చేస్తున్నారని నిలదీశారు. డీఈవో పోస్టుకు అర్హులు కారంటూ జిల్లా విద్యాశాఖాధికారి నాగరాజుపై... ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కలెక్టర్ కు ఫోన్ చేసి మీ పర్యవేక్షణ సరిగా లేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను వీటిన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్(Collector) ప్రవీణ్ ప్రకాష్ కు చెప్పారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరులో పూర్తి మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు.