Prathidhwani: ఇష్టమైతే సమాచారమిస్తాం.. లేదంటే లేదు.. రాష్ట్రంలో ఇదీ నేటి వైపరీత్యం - ఏపీలో సమాచార హక్కు చట్టం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 6, 2023, 10:40 PM IST

pratidhwani: సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. సమాచారహక్కు చట్టం. ఇది నిన్నటి మాట. ఇష్టమైతే సమాచారం ఇస్తాం.. లేదంటే లేదు. ఇదీ నేటి వైపరీత్యం. సమాచారం ఇవ్వాల్సిన పౌర సమాచార అధికారులు స్పందించరు... అదిలించి.. కదిలించాల్సిన కమిషన్ కన్నెర్ర చేయదు. ఫలితంగా దేశంలో ఎంతో ఉన్నతమైన చట్టాల్లో ఒకటైన సహ చట్టం నేడు.. రాష్ట్రంలో కొల్లబోతోందని.. పౌర సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లు.. సహచట్టం కింద సమాచారం కోరిన వారిపై దాడులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారన్న ఆవేదనలు సరేసరి. అసలు ఓ ప్రజాసామ్య ప్రభుత్వంలో కోరిన సమాచారమివ్వడంలో కాలయాపనలు, కొర్రీలు దేనికి? ఇలానే కొనసాగితే రాష్ట్రంలో సహ చట్టం అమలు భవితవ్యం ఏమిటి? పౌరుల సమస్యల పరిష్కారంలో ఎందుకు జాప్యం ఎందుకు జరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ జీవోలను సైతం ఎప్పటికప్పుడు బయటపెట్టకుండా గోప్యత పాటిస్తూ పారదర్శక పాలనకు పాతరేస్తోంది. ఇలాంటి సమయంలో ఆర్టీఐకి కూడా దిక్కులేక పోతే ఎలా?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.