Prathidwani : దేశంలో జమిలి ఎన్నికలు..! లాభమెవరికి..? నష్టమెవరికి..? - today hot Topic
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2023/640-480-19410773-thumbnail-16x9-jamili-elections.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 1, 2023, 11:03 PM IST
|Updated : Sep 1, 2023, 11:14 PM IST
Prathidwani : దేశంలో జమిలి ఎన్నికల సంకేతాల సందడి మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశారన్న సమాచారంతో.. ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికల్లో(Elections) మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Discussion on Jamili Elections : రోజురోజుకూ విపక్షాల మధ్య ఐక్యత పెరుగుతోంది. ఓట్ల చీలికపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఆమ్ఆద్మీ- కాంగ్రెస్ కలిస్తే పలు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి.. ఈ అనూహ్య పరిణామాల వెనక ఆంతర్యం ఏంటి? కేంద్రం జమిలి లేదా.. మినీ జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంత వరకు ఉంది? ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండొచ్చు? అధికార బీజేపీకి ఇది లాభమా.. నష్టమా అన్న విశ్లేషణలతో పాటు.. విపక్షాలు దీనికి ఎంత వరకు సన్నద్ధంగా ఉన్నాయి? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని.