PRATHIDWANI: మద్య నిషేధంలో ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది..?
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Liquor: దశలవారీగా మద్య నిషేధం నినాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు నిరంతరం మద్యం ప్రవాహం దిశగా సాగిపోతోంది. మద్యం అమ్మకాలు తగ్గిస్తామని హామీ ఇచ్చినా... అచరణలో మాత్రం దశలవారీగా మద్యం అమ్మకాలను పొడిగిస్తూ పోతోంది. రాష్ట్రంలో మద్యం ఆదాయం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయంటూ ప్రభుత్వం సమర్థించుకుంటున్న దుస్థితి నెలకొంది. దీనికి కొనసాగింపుగా అన్నట్లు... రాష్ట్రంలో వచ్చే మూడేళ్లపాటు బార్ల లైసెన్సులకు అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్య నిషేధం.. ఒక మిథ్యా విషాదంగా తయారయ్యింది. ఎన్నికల హామీగా ప్రకటించిన మద్యం నిషేధం విషయంలో సైతం ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది? రాష్ట్ర ప్రజల ఆర్థిక, ఆరోగ్య భద్రతను పణంగా పెట్టి అమలు చేస్తున్న ఈ తాగుడు విధానంతో తలెత్తే అనర్థాలేంటి? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST