Prathidwani ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు తొందరెందుకు - హైకోర్టు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16138716-917-16138716-1660837579683.jpg)
prathidwani ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు జీఓలు విడుదల చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ జీఓలను కొట్టేస్తామని స్పష్టం చేసింది. అసలు ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది. కేసుల ఉపసంహరణకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓలు ఎన్ని. వాటి ద్వారా కేసుల నుంచి ఉపశమనం పొందేది ఎవరెవరు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి. ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST