PRATHIDWANI మా సంక్షేమ పథకాలన్నీ ఏమయ్యాయి - no schemes to sc sts in the state
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17253648-784-17253648-1671466330591.jpg)
మూడన్నరేళ్లలో మాకు జరిగిన మేలేంటి.. మూడున్నరేళ్ల క్రితం వరకు అందిన 27 సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళికల నిధులు ఏమైపోయాయి. నిత్యకృత్యంగా మారిన దాడులు, దాష్టీకాల నుంచి రక్షణ ఎప్పుడు.. ఎలా.. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి దళిత సంఘాల నాయకులు, మేధావులు సంధిస్తోన్న సూటి ప్రశ్నలు ఇవి. ఇదే అజెండాతో విజయవాడలో జరిగిన దళిత, గిరిజన ఐకాస సమావేశంలోనూ ప్రభుత్వానికి ఇవే ప్రశ్నల పరంపరతో పాటు... ఇలాంటి వెన్నుపోటు ప్రభుత్వాన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఇంతగా ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వారి ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST