Prathidwani: ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల చేరికలు.. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది..?
🎬 Watch Now: Feature Video
Prathidwani: ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైన ఆయుధం. అతి ముఖ్యమైన ఆ ఓటు హక్కును తొలగిస్తున్నారంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. వివిధ జిల్లాలో వేలు, లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు, అదే విధంగా ఒకే డోర్ నంబర్‌తో వందలాది ఓటర్ల నమోదు విరివిగా జరుగుతోంది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? తాము ఏ పార్టీకైనా ఓటేయొచ్చని.. ఓట్లు తీయాల్సిన అవసరం ఏం వచ్చిందని బాధితులు ప్రశ్నిస్తున్నారు? ఇలా తీసేయడం ఒకెత్తయితే అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా ఓట్ల నమోదు మరో ఎత్తు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నినెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. ఆందోళనలు వ్యక్తం అవుతునే ఉన్నాయి. అయినా పరిస్థితి ఎందుకు మారడం లేదు. ఓట్ల మాయం ఎందుకు ఆగడం లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోనే కాదు.. రాయలసీమలోనూ ఓట్ల తొలగింపులు, దొంగఓట్లపై పెను దుమారం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేరికలపై ఆరోపణలు వస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? తప్పు జరిగింది అంటూనే.. అదేం పెద్ద విషయం కాదంటున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా స్పందనను.. ఎలా చూడొచ్చు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.