అరెస్టుల రాజ్యం అంతులేని అరాచకపర్వం - వైసీపీ ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటోంది?
🎬 Watch Now: Feature Video
Prathidwani: అరెస్టుల రాజ్యం.. అంతులేని అరాచకపర్వం అంటూ రాష్ట్రంలో జగన్ సర్కారు ఏలుబడిపై విపక్షాలు తూర్పారబడుతున్నాయి. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా కేసులు, అరెస్టులతో పోలీసు హింస పెచ్చరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేదు. విపక్షాలకు చెందిన వారైతే చాలు కేసు కట్టి లోపలేయడమే. నిరసనలపై నిషేధం.. అన్యాయం, అక్రమాలపై ప్రశ్నించడం నేరం.. ప్రజాస్వామిక హక్కులపై ఇదేం ఉక్కుపాదం అని ప్రజాసంఘాలు కూడా వాపోతున్నాయి. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? రాష్ట్రంలో భారత రాజ్యాంగమే అమలు అవుతోందా అనే తీవ్ర ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నాయి హక్కుల సంఘాలు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కేసులు, అరెస్టులతోనే ఎంతకాలం ఏలతారు? వ్యక్తులు ఎవరైనా కావొచ్చు.. విపక్షాలకు చెందిన నాయకులపై ప్రభుత్వం పెడుతున్న కేసులు, పోలీసులు చేస్తున్న అరెస్టులు చూస్తున్న తర్వాత మీకు ఏం అనిపిస్తోంది? ఇప్పుడు బీటెక్ రవి, ప్రవీణ్ రెడ్డే.. కొంచెం ముందుకు వెళితే ఈ జాబితా చాలే పెద్దదే ఉంది. అసలు ప్రతిపక్ష నేతల అరెస్టులు, పెడుతున్న కేసుల్లో ఎక్కడైనా నిబంధనలు పాటిస్తున్నారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.