Prathidwani: కోడికత్తి కేసు.. ఎన్‌ఐఏ నివేదికను వైసీపీ ఎందుకు అంగీకరించడం లేదు..? - జైల్లోనే మగ్గుతున్న శ్రీనివాసరావు
🎬 Watch Now: Feature Video
Prathidwani: హత్యలు చేసినవాళ్లు బయట తిరిగేస్తున్నారు.. చంపి మూట కట్టేసి పడేసినోళ్లకు బెయిల్ ఇచ్చేశారు.. నా కొడుకు ఏ తప్పు చేయకున్నా నాలుగున్నరేళ్లుగా జైల్లో పెట్టారని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కోడికత్తి శ్రీనివాసరావు కేసులో ఎలాంటి కుట్ర లేదని ఇప్పటికే ఎన్‌ఐఏ తేల్చిచెప్పింది. అయినా ఇంకా దర్యాప్తు కావాలని వైకాపా సర్కార్ పట్టుబడుతోంది. కనీసం బెయిలుకు నోచుకోక శ్రీనివాసరావు జైల్లోనే మగ్గుతున్నాడు. చివరిరోజుల్లో తమకు ఆసరాగా కుమారుడు ఉండాలని ఆ తల్లి వేడుకుంటోంది. విశాఖ దాడి ఘటనపై వైసీపీ ఎన్‌ఐఏ దర్యాప్తు కోరింది.. అదే ఎన్‌ఐఏ నివేదికను ఇప్పుడు ఎందుకు అంగీకరించడం లేదు? తమ తప్పుడు ప్రచారం గుట్టు రట్టు అవుతుందనే వైసీపీ ఆ నివేదికను అంగీరించడం లేదా? ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అనంత్‌బాబు విషయంలో వైకాపా అధినాయకత్వం ఇదే రీతిలో వ్యవహరించిందా? అత్యంత పేదరికంతో శ్రీనివాసరావు కుటుంబం కష్టాల్లో ఉంది. పేద దళితుడి విషయంలో ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తున్నారు? శ్రీనివాసరావు బెయిల్‌పై వస్తే ఎవరికి ఏమిటి ఇబ్బంది? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.