ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ స్పైసీ "గార్లిక్​ చికెన్ ఫ్రై" - ఇంట్లో ఇలా చేస్తే అందరూ ఫిదా అవ్వాల్సిందే! - GARLIC CHICKEN FRY IN TELUGU

-రెగ్యులర్​ చికెన్ ఫ్రైని మించిన టేస్ట్​! -సింపుల్​గా ఇలా చేసేయండి!

Garlic Chicken Fry Recipe
Garlic Chicken Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 3:58 PM IST

Garlic Chicken Fry Recipe : చాలా మంది "చికెన్ ఫ్రై" అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వేడివేడి బగారా రైస్​, ప్లేన్​ రైస్​, కుష్కా ఇలా వేటిలోకైనా చికెన్​ ఫ్రై అద్దిరిపోతుంది. అయితే, ఎక్కువ మంది ఇంట్లో ఎన్నిసార్లు చేసినా.. రెస్టారెంట్​ స్టైల్​ రుచి రావడం లేదని ఫీల్​ అవుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా "గార్లిక్​ చికెన్ ఫ్రై" ట్రై చేయండి.. టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. ఇలా చేస్తే.. ఒక్కపూటకే ఇంట్లో వండిన గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు! మరి ఇక ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకిలో (మీడియం సైజ్​లో కట్ చేసిన ముక్కలు)
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​- టేబుల్​స్పూన్​
  • కరివేపాకు రెమ్మలు - 2
  • కారం - రుచికి తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • పసుపు - అర టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు-15
  • దాల్చినచెక్క-చిన్నది
  • యాలకలు-3
  • లవంగాలు-3
  • టేబుల్​స్పూన్​ నెయ్యి
  • జీడిపప్పు -అరకప్పు

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఆపై ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు, టీస్పూన్​ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్​, టేబుల్​స్పూన్​ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి.
  • మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ అరగంటపాటు పక్కన పెట్టుకోండి.
  • ఆలోపు చికెన్​లోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నని తరుగులా కాకుండా కాస్త మందంగా ఉండేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఈ చికెన్​ ఫ్రై కోసం వెల్లుల్లిని మిక్సీలో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కచ్చితంగా ఒక ఐరన్​ కడాయి పెట్టి.. నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక దాల్చినచెక్క, యాలకలు, లవంగాలు వేసి కాసేపు ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగాయనుకున్నాక.. అందులో మ్యారినేట్​ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేయండి.
  • చికెన్​లో నీళ్లు మొత్తం ఇగిరిపోయి.. పైన ఆయిల్​ తేలేంత వరకు హై-ఫ్లేమ్​లోనే ఫ్రై చేసుకోండి.
  • ఆ తర్వాత మీడియం ఫ్లేమ్​లో ముక్క రంగు మారే వరకు గరిటెతో నెమ్మదిగా వేపుకోండి.
  • అనంతరం గ్రైండ్​ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి లో-ఫ్లేమ్​లో ఫ్రై చేసుకోండి. ఆపై ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపండి.
  • చికెన్​ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీలకర్రపొడి, కారం, గరంమసాలా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​ మీద ఉంచి మసాలాలన్ని చికెన్​కు పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి.
  • చికెన్​కి మసాలాలు అన్నీ పట్టిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు స్టౌపై తాలింపు గిన్నె పెట్టండి. ఇందులో టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి కరిగించండి. అనంతరం వేడివేడి నెయ్యిలో జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోండి.
  • జీడిపప్పు ఫ్రై అయ్యాక చికెన్​లో నెయ్యితో సహా వేసి కలుపుకోండి. అలాగే పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి మిక్స్​ చేయాలి. ఇలా చికెన్​ ఫ్రైలోకి జీడిపప్పు ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల రుచి ఎంతో బాగుంటుంది.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే అద్దిరిపోయే చికెన్​ ఫ్రై రెడీ!
  • ఈ చికెన్​ ఫ్రై నచ్చితే ఓ సారి ఇంట్లో తప్పక ట్రై చేయండి.

సండే స్పెషల్ - తెలంగాణ స్టైల్​లో "చికెన్ ఫ్రై" ఇలా చేయండి - రుచి అద్దిరిపోతుంది!

న్యూ ఇయర్​ స్పెషల్​ ​నాన్​వెజ్ థాలీ "మటన్​ బిర్యానీ, చికెన్​ తవా, ఫిష్​ ఫ్రై" చేసేయండిలా - రుచితో పాటు పార్టీ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.