నేతల కనుసన్నల్లోనే తవ్వకాలు.. ఈ దందాలన్నీ అడ్డుకునేది ఎవరు? - pd on land maffia
🎬 Watch Now: Feature Video
కొండలు.. గుట్టలు.. చెరువులు.. కట్టలు అన్నీ లూటీ. కంకర, మట్టి, గ్రావెల్.. అన్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భౌగోళిక వారసత్వ సంపదల్ని వదలడం లేదు. నేతల కనుసన్నల్లోనే ఈ దందాలన్నీ సాగిపోతుంటే.. అడ్డుకునేది ఎవరు? కన్ను పడితే చాలు కొల్లగొట్టి కాసులు పిండుకుంటున్నారు. రవ్వలకొండ అన్నా కనికరం లేదు. ఎర్రమట్టి దిబ్బలు అన్నా గౌరవం లేదు. పలుకుబడి ఉపయోగిస్తే చాలు.. ఇక ఎదురన్న మాటే లేకపోవడంతో.. చోటామోటా నాయకులకు కూడా ఇదొక ఆదాయ వనరుగా మారిన పరిస్థితి. ఊరువాడా ఇలాంటి అక్రమ తవ్వకాలకు ఎన్నో తార్కాణాలు. వీటికి అడ్డుకట్ట వేసేదెలా అన్నదే ఇప్పుడు రాష్ట్రంలోని పలువుర్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..