Prathidwani: జీవో-1 కొట్టివేత సర్కార్‌కు చెబుతున్న పాఠమేంటి? - జీవో నెం 1పై హైకోర్టు తీర్పు
🎬 Watch Now: Feature Video
Prathidwani: వైకాపా ప్రభుత్వానికి మరోసారి.. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హడావుడిగా తెచ్చిన అడ్డుగోలు జీవోను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ప్రాథమికహక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవో నెంబర్ వన్ ఏ విధంగానూ కోర్టుల్లో నిలబడదని తెలిసినా వైకాపా ప్రభుత్వం ఎందుకు ఈ జీవో తెచ్చింది? ప్రభుత్వ న్యాయవాదులు ఈ విషయం తెలియదా? అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది? జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు చెబుతున్న పాఠం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. ఈ చర్చలో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర, జనసేన సీనియర్ నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణంలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.