అంబేద్కర్ ఏం చెప్పారు ? సీఎం జగన్ ఏం చేస్తున్నారు ?
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 9:56 PM IST
|Updated : Jan 18, 2024, 6:23 AM IST
హక్కుల సారథి.. పీడితుల దిక్సూచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. పేద, బడుగు వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభ్యుదయం కోసం జీవితాన్ని అంకితం చేశారాయన. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతకర్త, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు మన అంబేద్కర్. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించిన దీర్ఘదర్శి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఎత్తైన విగ్రహాన్ని 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ మూర్తి సరే, ఆయన స్ఫూర్తిని పాటిస్తున్నారా ? అంబేద్కర్ ఏం చెప్పారు ? మన సీఎం జగన్ ఏం చేస్తున్నారు ? ఇదేనా అంబేద్కర్‌కు అందించే నిజమైన నివాళి ? దీనిపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఏపీ మాల మహా సభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సుప్రీం కోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు.