Prathidhwani 2024 ఎన్నికలు.. విపక్షాల కూటమితో బీజేపీకి చెక్ - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Prathidhwani: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు అందరిచూపు... బిహార్ రాజధాని పట్నా వైపు మళ్లింది. 18 పార్టీలతో కూడిన విపక్షాల కూటమి కీలకమైన భేటీకి ఆ నగరం వేదిక అవుతూ ఉండడమే అందుకు కారణం. 2024 ఎన్నికలకు సమాయత్తం... తమకు అవకాశం ఉన్న 450 వరకు లోక్‌సభ స్థానాల్లో బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా ఈ సమాలోచనలు జరగనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో విపక్ష కూటమికి ఉన్న బలాబలాలు ఏమిటి? అధికార బీజేపీ తన పట్టు నిలబెట్టుకునే దిశగా ఏం చేయబోతోంది. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ నేతృత్వంలో పట్నాలో భేటీకి హాజరవుతున్నామన్న ఎన్సీపీ అధినేత శరాద్ పవార్. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఫలితాలు బూస్ట్ అంటున్న కూటమి నేతలు అదేస్ఫూర్తితో పనిచేస్తే బీజేపీకు చెక్ పెట్టవచ్చని ఆశాభావం. రాష్ట్రాలవారీగా ఇరువర్గాలకు ఈ విషయంలో ఉన్న అవకాశాలేంటి? 2024 ఎన్నికల వరకు వారిని ఇంతేబలంగా కలిపిఉంచే ఇరుసేంటి? అదే సమయంలో విపక్షకూటమికి నాయకత్వం వహించేదెవరు?విపక్షాల భేటీ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపించొచ్చు?