మెగా డీఎస్సీ ప్రచారమే తప్ప ప్రకటన ఊసు ఎక్కడ ?
🎬 Watch Now: Feature Video
Prathidhwani: మెగా డీఎస్సీ అన్న జగన్ మాటలు నమ్మి దగా పడిన నిరుద్యోగ యువతకు దిక్కెవరు? మెగా మాట దేవుడెరుగు ఏ DSC కూడా లేకుండానే వైకాపా సర్కారు పదవీకాలం పూర్తి కావొస్తున్న తరుణంలో వాళ్ల పరిస్థితేంటి? నాలున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం నుంచి ప్రచారం తప్ప ప్రకటన ఊసు లేదు. నోటిఫికేషన్ జాడ లేదు. పైగా కడుపుమండిన నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాల్లో వారిని అణిచి వేసేందుకే ప్రయత్నించారు తప్ప నాడు గర్జిస్తూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రం ప్రయత్నించిన పాపాన పోలేదు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత పెరుగుతున్నా, లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నా జగన్ ప్రభుత్వం అవేవీ పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తోంది? ప్రతిపక్షంలో ఉండగా 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నాటి ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల తమ ప్రభుత్వంలో టీచర్ పోస్టులు నింపారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.