చంద్రబాబు అంటే జగన్ ఎందుకు అంతలా భయపడుతున్నాడు..? - జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 10:08 PM IST
Prathidhwani: చంద్రబాబు ప్రజాక్షేత్రంలో ఉంటే జగన్‌కు ఎన్నికలు ఎదుర్కోలేను అనే భయమా? చంద్రబాబు అరెస్టు నుంచి బెయిల్ వరకు సాగిన పరిణామాల్ని గమనిస్తే వారికి ఇక్కడ రెండు ప్రధాన ప్రశ్నలు... 1) చంద్రబాబుపై కేసుల మీద కేసులు ఎందుకు పెడుతున్నట్లు ? 2) ఆయన్నుమీడియాతో మాట్లాడనివ్వకుండా ఆంక్షలు పెట్టాలని కోరడం వెనక ఆంతర్యమేంటి? బాబు బయట ఉంటే భయం... బెయిల్ వస్తే భయం... బయటకు వచ్చి మాట్లాడితే భయం.. ఇన్ని భయాల మధ్య జగన్... తన పార్టీకి ఏవిధంగా అభయం ఇవ్వగలరు? రాజకీయ ప్రభావాల పరంగా చూసినప్పుడు.. చంద్రబాబు లాంటి వ్యక్తిని కటకటాల్లో పెడితే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ప్రత్యర్థులకు తెలిసి వచ్చిందా? జగన్ కక్ష సాధింపులకు వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకులు మూల్యం చెల్లించు కోబోతున్నారా? రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారో ఇప్పటికే తెలిసిపోయిందా? జగన్ మంత్రుల బస్సు యాత్రల్నే తీసుకుంటే.. ఏ ఊరుకెళ్లినా జనాల్లేక వెలవెలబోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ఎన్నికలప్పుడు వైకాపా పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.